బిర్సా ముండాను చంపితే రూ.500 రివార్డు.. అందరికీ తెలియాల్సిన చరిత్ర

Birsa Munda Biography - Suman TV

1897 నుంచే బ్రిటీషర్లకు నిద్రలేకుండా చేసిన ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మాభిమానం కోసం, గిరిజనుల హక్కుల కోసం, స్వతంత్రం కోసం మన్యం వీరుడు సాగించిన ఉద్యమం గురించి తెలుసుకొని తీరాలి. జార్ఘండ్‌లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15 గురువారం నాడు బిర్సా ముండా జన్మించారు. బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు.

బిర్సా అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ దగ్గర్లోని సాల్గా అనే గ్రామంలోని పాఠశాలలో చేరాడు. తర్వాత బూర్జు మిషన్ స్కూలుకు మారాడు. అప్పుడే అతని కుటుంబం క్రైస్తవాన్ని స్వీకరించింది. అతని ప్రతిభను గమనించి పశ్చిమ సింగ్ భూం జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూలు యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి తనజాతి వారి కోసం బ్రిటిషర్లతో పోరాటం చేశారు బిర్సా.

Birsa Munda Biography - Suman TVఆదివాసీ యవతను చైతన్యం చూస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిం చారు. చోటా నాగపూర్‌ ప్రాంతంలో అడవి మీద ఆధారపడే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం నడిపాడు. ఆది వాసులు అందరూ చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. కుంతి, తామర్, బసియా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్‌ ఉద్యమాన్ని నడిపారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్‌ పాలకులు 1900 జనవరి 5న ఆయన ఇద్దరి అనుచరులను కాల్చి చంపారు. ఈ సంఘటన బిర్సా ముండా మనసును కలచి వేసింది.

2021 t20 world cup most valuable player listఎం ఏ ఫోబ్స్, ఎంసీ సిట్రిడ్‌ పైడ్‌ అనే బ్రిటిష్‌ కమిషనర్లు ‘బిర్సా ముండా’ను చంపితే రూ. 500 ఇస్తామని అప్పట్లో రివార్డు కూడా ప్రకటించారు. బ్రిటిష్‌ సాయుధ బలగాలు దుంబర్‌ హిల్‌ అనే పర్వత ప్రాంతంలో ‘బిర్సా ముండా’పైన కాల్పులు జరిపారు. ఆ ఘటనలో చాకచక్యంగా తప్పించుకున్నారు బిర్సా. అయితే జంకోపాయి అడవిలో 3 మార్చి 1900న అరెస్ట్‌ అయ్యారు. 460 మంది ఆదివాసీ ప్రజలను 15 క్రిమినల్‌ కేసుల్లో బ్రిటిషర్లు అక్రమంగా ఇరికించారు. 1900 జూన్‌ 19 న ‘బిర్సా ముండా’ జైల్లో చనిపోయారు. బిర్సా ముండా ఉద్యమ ప్రభావ ఫలితంగా 1908లోలో బ్రిటిష్‌ ప్రభుత్వం చోటా నాగపూర్‌ కౌలు హక్కు దారు చట్టం తీసుకొచ్చింది.