ఆస్తి రాయించుకుని తల్లిని గెంటేసిన కొడుకులు.. గుణపాఠం చెప్పిన తల్లి

Doctorate

నేటి కాలంలో ఆస్తి కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. అవసరమైన గొడవలు చేయడం, కాదంటే హత్యలకు కూడా వెనకాడని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇలా ఓ వారసత్వ ఆస్తిలో భాగంగా అస్తి అంత రాసుకుని కనిపెంచిన తల్లిని కుమారులు ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఆ తల్లి కుమారులకు దిమ్మతిరిగే షాకిస్తూ చక్కటి గుణపాఠాన్ని చెప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన ప్రేమవ్వ అనే వృద్ధురాలికి 76 ఏళ్లు.

ఇద్దురు కుమారులతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే అందరి పెళ్లిళ్లు చేసిన ప్రేమవ్వ కుమారులే వద్దే ఉంటుంది. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తిని కుమారులతో పాటు కూతుళ్లు కూడా పంచుకోవాలని భావించి తల్లిని బెదిరించి అందరూ సమానంగా పంచుకున్నారు. ఇక ఇంతటితో ఆగక కుమారులు ప్రేమవ్వను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో తట్టుకోలేకపోయిన ఆ వృద్ధురాలు న్యాయపోరాటానికి దిగింది. నా కుమారులు, కూతుళ్లు ఆస్తి అంతా తీసుకుని నన్ను బయటకు పంపారని, దానిని రద్దు చేసి అందులో నాకు వాటాని ఇప్పించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది.

మూడేళ్లుగా సాగిన ప్రేమవ్వ న్యాయపోరాటంలో చివరికి గతంలో ఆమె చేసిన ఆస్తి పంపకాన్ని రద్దు చేస్తూ స్థానిక రెవెన్యూ విభాగం అసిస్టెంట్ కమిషనర్ తీర్పునిచ్చారు. దీంతో కుమారులు లాగేసుకున్న ఆస్తి అంతా ఇప్పుడు ప్రేమవ్వ పేరు మీదకు మళ్లింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో కుమారులకు, కూతుళ్లకు చక్కటి గుణపాఠాన్ని చెప్పినట్లు అయిందని స్థానికులు చెబుతున్నారు. మూడేళ్లుగా మొక్కవోని సంకల్పంలో విజయం సాధించిన ప్రేమవ్వ పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.