వ‌ర్ధ‌మాన్ అభినంద‌న్‌ కు వీర్ చక్ర పురస్కారం

Vardhaman Abhinandan Veer Chakra

భార‌తీయ వైమానిక ద‌ళ పైలెట్‌ వ‌ర్ధ‌మాన్ అభినంద‌న్‌ తెగువకు యావత్ భారతావని తలవంచింది. 2019, ఫిబ్ర‌వ‌రి 27న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన విషయం తెలిసింది. ఎల్వోసీ వద్ద శత్రుదేశమైన పాకిస్తాన్ కు చెందిన యుద్ద విమనాలు అభినందన్ కంటపడ్డాయి. దీంతో హుటాహుటిన స్పందించిన అభినందన్ తన తెగువతో పాకిస్తాన్ ఎఫ్‌-16 యుద్ధ విమానలను తన మిస్సైల్‌తో కాల్చేశాడు. ఇలాంటి ధైర్య సాహసాలు కనబరిచిన అభినందన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు.

ఇక అప్పట్లో బాల్ కోట్ వైమానిక దాడులులో ఈ ఘటన జరిగింది. ఇక పాకిస్తాన్ ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు ఎదురొడ్డి పోరాడిన అభినందన్ ఆయన విమనాన్ని శుత్రదేశమైన పాకిస్తాన్ కూల్చివేసింది. దీంతో చాకచక్యంగా తప్పించుకుని అభినందన్ ప్యారాచూట్ సాయాంతో పాక్ గడ్డపై దిగాడు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అభినందన్ ను పట్టుకుని కొంత కాలం తర్వాత విడిపెట్టారు.