సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మేజర్ మూవీలో హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. 26/11/2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాదుకు విచ్చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రోటోకాల్ ప్రకారం తొలుత గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలుకగా, తర్వాత సీఎం కేసీఆర్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. స్వాగతం పలికిన తర్వాత రాష్ట్రపతికి అందరినీ పేరుపేరునా పరిచయం చేశారు. ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని […]
భారతీయ వైమానిక దళ పైలెట్ వర్ధమాన్ అభినందన్ తెగువకు యావత్ భారతావని తలవంచింది. 2019, ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన విషయం తెలిసింది. ఎల్వోసీ వద్ద శత్రుదేశమైన పాకిస్తాన్ కు చెందిన యుద్ద విమనాలు అభినందన్ కంటపడ్డాయి. దీంతో హుటాహుటిన స్పందించిన అభినందన్ తన తెగువతో పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానలను తన మిస్సైల్‌తో కాల్చేశాడు. ఇలాంటి ధైర్య సాహసాలు కనబరిచిన అభినందన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల […]