హేమ బైట్ ఎఫెక్ట్: శివ బాలాజీకి సెఫ్టిక్! ఆసుపత్రిలో చికిత్స!

సినిమాల్లో వచ్చే యాక‌్షన్‌ సీన్లు, ఎమోషన్‌, పంచ్‌ డైలాగ్‌లు, ర్యాలీలు, ట్విస్ట్‌లు, క్లైమ్యాక్స్‌ ఇలా అన్ని మిక్స్‌ అయ్యి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగాయి. అసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందారు. కాగా ఆదివారం జరిగిన పోలింగ్‌ సమయంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన హేమ, విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలో ఉన్న శివబాలజీ చేయిని నోటితో కొరికారు. ఆ దృశ్యం కెమెరాల్లో రికార్డు కూడా అయింది.

Hema Byte Shiva Balaji Hand - Suman TVకాగా ఆమె కొరిన గాయం సెప్టిక్‌గా మారింది. సోమవారం శివబాలజీ నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి దానికి చికిత్స తీసుకున్నారు. కాగా తన భర్తను కోరికిన నటి హేమపై శివబాలజీ భార్య మధుమిత మండిపడ్డారు. ‘అసలు ఆమె మనిషేనా? మనుషులెవరైనా ఇలా చేస్తారా?’ అని ఘాటుగా స్పందించారు. కాగా ఓటు వేసేందుకు వెళ్తున్న తనను శివబాలజీ చేయి అడ్డుపెట్టి అడ్డుకున్నారని, తప్పుకోమని కోరినా వినలేదని అందుకే కొరికానని హేమ వివరణ ఇచ్చారు.