ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అందేంటీ ‘మా’ ఎన్నికల నేపధ్యంలో ఇరువురి మధ్య మాటలు యుధ్దం కొనసాగుతోంది కదా, ఇలాంటి సమయంలో చిరంజీవి, మోహన్ బాబు కు ఫోన్ ఎందుకు చేసుంటారని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల సందర్బంగా మోగా ఫ్యామీలీకి, మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య వివాదం చలరేగుతోంది.
‘మా’ ఎన్నిదలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ కు అన్నయ్య చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు చెప్పడం, ప్రకాశ్ రాజ్ కోసం తనను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోమని మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ చేసినట్టు విష్ణు మంచు వెల్లడంచడం ఆసక్తికరంగా మారింది.
ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబుకు ఫోన్ చేసిన చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేశారు. ‘మా’ ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అకారణంగా తన పేరు బయటకు వచ్చిందని మోహన్ బాబుతో చిరంజీవి చెప్పారని సమాచారం. చిరంజీవి ఫోన్ కాల్ కు మోహన్ బాబు స్నేహపూర్వకంగా స్పందించారని, అందరం కలసికట్టుగా ఉండాలనేది తన అభిమతమని చిరంజీవితో చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
అంతే కాదు చిరంజీవి చేయికి గాయం అయిన నేపధ్యంలో, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని మోహన్ బాబు అడిగారట. కుడి చేతితో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యుల్ని సంప్రదించానని, మణికట్టు దగ్గరల్లో ఉన్న నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా జరుగుతోందని, వైద్యులు సర్జరీ చేశారని చిరంజీవి వివరించారు. 15 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారని చిరంజీవి చెప్పడంతో, ఆరోగ్యం జాగ్రత్త అని మోహన్ బాబు సూచించారని తెలుస్తోంది.