చేప మందుపై కరోనా ప్రభావం.. ఈసారి చేప ప్రసాదం లేదు

హైదరాబాద్-  కరోనా చాలా రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు అస్తవ్యస్తం అయ్యాయి. భారత్ లాంటి మన దేశంలో జన జీవనం స్తంభించి పోయింది. సామాన్యులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. కరోనతో ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయంలో పడ్డాయి. ఇప్పుడు కరోనా చేపల మందు పంపిణీ పై కూడా ప్రభావం చూపుతోంది. కరోనా తో చేపల మందు ఆగిపోయింది. హైదరాబాద్ నగరంలో ప్రతి యేటా బత్తిని సోదరులు ఉబ్బసం రోగులకు చేపల మందును పంపిణీ చేస్తుంటారు. కానీ ఈసారి చేపల మందు ప్రసాదానికి బ్రేక్ పడింది.

Fish medicine
తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తో పాటు ఇత రాష్ట్రాల నుంచి బత్తిన హరనాథ్ గౌడ్ ఇచ్చే చేప మందు కోసం పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు వస్తుంటారు. ప్రతి ఏటా మృగశిర కార్తీ రోజు ఈ చేప మందు పంపిణీ చేస్తారు. చేప మందు వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని చాలా మంది నమ్మకం. తెలంగాణ లో  ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
కరోనా కేసుల పెరుగుదలతో పాటు, రాష్ట్రంలో లాక్ డౌన్, ఇతర రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు నేపథ్యంలో చేప మందు ను పంపిణీ చేయడం లేదని హరనాథ్ గౌడ్ తెలిపారు. మృగ శిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నా విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ఆయన చెప్పారు. అయితే ఈసారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ చెప్పారు. కరోనా పరిస్థితులు, ఇతర అంశాల పరిశీలన తరువాత వచ్చే సంవత్సరం చేప మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.