హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజుల ఆస్తమా రోగులకు చేప ముందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా బత్తని బ్రదర్స్ మృగశిర కార్తె ప్రవేశించగానే 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి ఈ మందు వేసుకుంటారు.
హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున చేప మందు పంపిణీ చేస్తారు. ఈ సంవత్సరంలో కూడా అదే విధంగా చేప మందు పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఈ మందు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి కూడా చాలా మంది వస్తుంటారు. దీనిని ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘ కాలిక రోగాలతో బాధపడే వారు ఈ చేప మందు తీసుకుంటారు. ఈ మందు పంపిణీ రోజు వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు.
దేశంలో కరోనా ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి చేప మందు కరోనా కారణంగా పంపిణీ చేయట్లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ సంవత్సరం చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని అమర్ నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బత్తిని బ్రదర్స్ మాట్లాడుతూ..ఈ సంవత్సరం జూన్ 9న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 9న ఉదయం 8 గంటలకు మొదలు పెట్టి 10 వ తేది 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు లక్షల మంది చేప మందు స్వీకరించి శాశ్వత పరిష్కారం పొందారని బత్తిని సోదరులు తెలిపారు.
ప్రభుత్వం రతపున కొర్రమీను లైవ్ ఫిషెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సహాకారంతో చేప ప్రసాదం పంపిణీ ఉచితంగా అందిస్తామని వారు వెల్లడించారు. నాంపల్లి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. ఈసారి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటల తర్వాత ఏమీ తినకూడదని వారు పేర్కొన్నారు. చేప మందు తీసుకున్న తర్వాత 45 రోజులు పత్యం చేయాలని వివరించారు.