వద్దు.. వద్దు.. అని బతిలాడినా.. యువతిని చితకబాది

nellore women harassment ap

మహిళలపై రోజురోజుకు అకృత్యాలు, దారుణలు పెరిగిపోతూనే ఉన్నాయి.. హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యచారం జరిపి హత్య చేసిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగానే నెల్లూరులో ఓ యువతిని చితక బాదుతూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ యువతి ఎంత ఏడుస్తూ వదిలేయమని బతిమాలుతున్నా కనికరం లేకుండా కర్రతో, చేతితో ఇష్టమొచ్చినట్లు కొడుతూ, అసభ్యకర పదజాలంతో దూషిస్తున్న దృశ్యాలు వీడియోలో చూడొచ్చు. అతను కొడుతున్నా ఆ యువతి అతన్ని పట్టుకు ఏడుస్తుంది. ఏ కారణం చేత ఆ వ్యక్తి యువతిని కొడుతున్నాడో తెలియాల్సి ఉంది. అయిన కూడా ఒక యువతిని అలా పట్టుకుని కొట్టడాన్ని ఆ వీడియో చూసిన వారు తప్పుబడుతున్నారు. పైగా దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియా పెట్టి, ఇంత ధైర్యంగా నేరం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.