ప్రియురాలి ప్రేమ కోసం లక్షల్లో ఖర్చు! చివరికి కులం పేరుతో విడదీశారు

Harassed By Sircilla

ప్రేమ.. ఈ రెండక్షరాల పదం కులం, మతం చూడకుండా ప్రేమికులను దగ్గర చేస్తుంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. కానీ యువతి తల్లిదండ్రులు మాత్రం యువకుడి కులం పేరుతో వేరుచేయాలని చూశారు, చేశారు. ఇంతటితో ఆగకుండా పోలీసులతో వేధింపులకు గురి చేయడంతో ఆ యువకుడ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు గ్రామం. ఇదే గ్రామంలో గొడిసెల దిలీప్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఇక పక్కనే ఉన్న చింతలఠాణా గ్రామంలోని ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొంత కాలం తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంతలో ఆ యువతి అనారోగ్యపాలై ఆస్పత్రిలో చేరింది. దీంతో భయందోళనకు గురైన ప్రియుడు దిలీప్ తన ప్రియురాలు ఆస్పత్రిలో చేరడంతో తట్టుకోలేకపోయాడు. ఎంత డబ్బైన ఇవ్వటానికి సిద్దపడి ఏకంగా తన ప్రియురాలి కోసం రూ.3 లక్షల వరకు ఖర్చుచేశాడు.

ఇక కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ఆరోగ్యం మెరుగుపడింది. కొంత కాలానికి వీరిద్దరి ప్రేమ విషయం ప్రియురాలి ఇంట్లో తెలిసింది. కులం తక్కువ వాడితో తమ కూతురి ప్రేమ విషయం బయటపడి పరువు పొతుందని భావించి వీరిద్దరిని విడదీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ముందుగా తమ కూతురికి మామమాటలు చెప్పి ఆ యువకుడిపై వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు కూడా ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అండబలం తోడవ్వడంతో రౌడీ షీట్ లో చేరుస్తామంటూ పోలీసులు సైతం బెదిరించారు.

ఇవన్నీ చూసిన యువకుడు తీవ్ర మనస్థాపానికి గురైన ఫేస్ బుక్ లైవ్ పోలసులు నాపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, రౌడీషీట్ లో చేరుస్తామంటూ చెప్పారని దీంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ యువకుడు తెలిపి సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కులం పేరుతో ప్రియురాలి నుంచి విడగొట్టి అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టిన యువతి కుటుంబీకుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.