కరెంట్ షాక్ కు బలైన భార్యాభర్తలు.. అనాధలైన ఇద్దరు ఆడపిల్లలు

Bayyaru Hyderabad Telangana

ఉపేందర్, తిరుపతమ్మ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఉపేందర్ తన తండ్రి ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్ నుంచి ఇంటకొచ్చారు. కొడుకు కోడలు వచ్చారని తండ్రి సంబరపడేలోపే కరెంట్ తీగ పట్టుకోవడంతో కొడుకు, కోడలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబా బాద్ జిల్లా బయ్యారు మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలోని సింగారం కాలనీకి చెందిన ఉపేందర్‌, తిరుపతమ్మ భార్యభర్తలు. గతంలో వీరిద్దరు ప్రేమించుని పెళ్లి చేసుకున్నారు.

ఇక ఉద్యోగ నిమిత్తం వీరిద్దరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈ మధ్యకాలంలో ఉపేందర్‌ తండ్రి కాలు విరిగిపోవడంతో చూడడానికి భార్యపిల్లలతో పాటు ఉపేందర్ ఇంటికొచ్చాడు. ఈ క్రమంలోనే ఇంటు ముందు ఉన్న తీగ తగలడంతో కరెంట్ షాక్ తో భార్యాభర్తలు ఉపేందర్‌ తిరుపతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక స్థానికులు ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి స్థానిక ఆస్పత్రికి తరలించే లోపే వారు ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇక వీరి అంతిమ యాత్రలో ఇద్దరు కూతుళ్లు కన్నీరుమున్నీరుగా గుండెలు బాదుకుండు ఏడుస్తుంటే గ్రామంలోని ప్రజలంతా వారి కన్నీటిని చూడలేకపోయారు. అమ్మా.. నాన్నా.. లేండి. ఇక మాకు దిక్కెవరు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటూ కూతుళ్ల కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇక వీరి మరణం పట్ల స్పందించిన అదనపు కలెక్టర్‌ సింగారం కాలనీకి వెళ్లి పిల్లలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వీరిని ప్రభుత్వ తరపున ఆదుకుంటామంటూ పలువురు అధికారులు చెప్పారు.