భార్య స్నానం చేయటం లేదంటూ విడాకులు కోరిన భర్త

wife no bathing

యువతి యువకులకు గత సంవత్సర క్రితం పెళ్లైంది. దీంతో వీరి సంసారం సంతోషంగా సాగుతూ వస్తోంది. ఒక పాప కూడా జన్మించింది. అయితే ఈ క్రమంలోనే నా భార్యతో ఉండలేనని, నాకు విడాకులు కావాలని ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అసలు విషయం ఏంటి? భర్త విడాకులు ఎందుకు కోరాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతం పెళ్లై ఓ పాపతో వీరి జీవితం హాయిగా సాగిపోతూ ఉంది.

అయితే ఈ తరుణంలో భార్య స్నానం చేయటం లేదంటూ వీరిద్దరి మధ్య కొన్నాళ్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక భరించని భర్త భార్య రోజు స్నానం చేయటం లేదంటూ విడాకుల కోసం భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఖంగుతిన్న భార్య నా భర్త నుంచి నేను విడాకులు కోరుకోవడం లేదంటూ ఆ మహిళ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ను ఆశ్రయించింది. ఇక వీరిద్దరి తల్లిదండ్రుల సమక్షంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు భార్యాభర్తలకు కౌన్స్ లింగ్ ఇచ్చారు. ఇక భర్త ఎంతకు వినకపోవటంతో అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక భార్యకు ఇష్టం లేకుండా ఏ భర్త కూడా విడాకులకు అర్హులు కారని అధికారులు చెబుతున్నారు. ఈ భార్యభర్తల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.