అందంలో తగ్గేదెలే.. కానీ 28 మంది పిల్లలతో ఈ కీలాడీ ముఠా నయా మోసం..!

చూడటానికి అందంగా ఉంది. వృత్తి రిత్యా డాక్టర్. కానీ.. మోసాల్లో మాత్రం ఈమెకు ఎవరు సాటి రారు అనేలా రాటుదేలింది. అసలు ఈ అందెగత్తె ఏం చేసింది. చేయటానికి దారి తీసిన గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని బెంగుళూరు నగరం. ఆమే పేరు రష్మి. సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తూ డాక్టర్ గా సేవలు అందిస్తుంది. కానీ ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ కీలాడీ మోసంలో కళ్లు బైర్లుకమ్ముతున్నాయి.

ఇక విషయం ఏంటంటే..? సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తూ తమ వైద్య ధర్మానికి తూట్లు పొడిచేందుకుం కంకణం కట్టుకుంది ఈ దుర్మార్గులు. ఇక పిల్లలు లేని దంపతుల ప్రతీ రోజు తమ్మ వద్దకు వస్తూ ఉండేవారు. అలా చాలా వస్తూ ఉండటంతో వీరిని ఆసరగా చేసుకుని సరికొత్త బిజినెస్ కు పావులు కదిపింది. నవజాత శిశువులను తల్లుల నుంచి దూరం చేసి సంతానలేమితో బాధపడుతున్న వారికి అమ్ముకుంటున్న ఈ మహిళ ముఠా లక్షలు సంపాదిస్తుంది. ఈ మహిళా ముఠా గ్యాంగ్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలలో ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టి ఎంతో సంపాదనను కూడబెట్టుకుంది.

lady doctorఅలా ఎంతో మంది పిల్లలు లేని కుటుంబాలను టార్గెట్ చేయటం, అప్పుడే పుట్టిన పిల్లలను తల్లుల నుంచి వేరు చేయటం, ఆ పిల్లలను పిల్లలు లేని దంపతులకు రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకోవటం, దీంతో లక్షల్లో సంపాదించటం ఇదే ఈమే నయా బిజినెస్. ఇలా ఈ దుర్మార్గపు ఆలోచనలతో ముందుకెళ్తున్న రష్మి ఎట్టకేలకు పోలీసు కళ్లు కప్పి తప్పించుకోలేకపోయింది. తాజాగా ఈ ముఠాలో 5 మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. వీరు సాగిస్తున్న ముఠాలను అన్ని నగరాల్లో ఉన్న కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి చేసిన మోసాలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.