మామ ముందే ప్రియుడితో కోడలి రొమాన్స్.. ఓ కన్నేసి ఉంచిన మామ చివరికి..!

వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ పచ్చని సంసారాల్లో అగ్గిరాజేసుకుంటున్నారు. వీటి కారణంగా ఎన్నో కాపురాలు ఇప్పటికీ ఎటు కాకుండా వెళ్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని పరిగి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం నసకల్‌ గ్రామానికి చెందిన మంగమ్మ, నర్సింహులు ఇద్దరు భార్యాభర్తలు. గతంలో వీరికి పెళ్లై వీరిద్దరి వైవాహిక జీవితం సాఫిగానే సాగింది.

అయితే కొన్నాళ్లకే భర్త నరసింహులు మరణించాడు. దీంతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న మంగమ్మకు కొంత కాలానికి నసీఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఒకరినొకరు కలుసుకోవటంతో పాటు శారీరక సుఖానికి కూడా అలవాటు పడ్డారు. దీంతో భర్త మరణించటంతో మంగమ్మ ఎంచక్క ప్రియుడితో రోమాన్స్ కు తెరతీసింది. ఈ విషయం కాస్త మంగమ్మ మామకు చేరింది. దీంతో స్పందించిన మామ కృష్ణయ్య కోడలితో పలుమార్లు వాదనకు దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

ఇక మంగమ్మ నడవడికపై మామ కృష్ణయ్య ఓ కన్నేసి ఉంచాడు. దీంతో ప్రియుడితో సరసాలకు మామ అడ్డొస్తున్నాడని భావించిన కోడలు మంగమ్మ ఏకంగా మామ హత్యకే ప్లాన్ వేసింది. మంగమ్మ ప్రియుడి సాయంతో ఓ రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇద్దరూ కృష్ణయ్య గొంతు పిసికి హత్య చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో మంగమ్మ ప్రియుడు నసీఫ్ నిందితులుగా తేలారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగమ్మను అరెస్ట్ చేసి పరారిలో ఉన్న నిందితుడు నసీఫ్ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.