పడక సుఖం కోసం పాకులాడిన మహిళ.. చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేదు!

widow

వివాహేతర సంబంధాలలో తలదూర్చిన కొందరు మహిళలు నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. దీని కారణంతో ఎంతో మంది మహిళలు రోడ్డున పడి, ప్రాణాలను పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి దారుణ ఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుమ్లా జిల్లాలోని మెరల్ పంచాయతీ కుదర్ అనే గ్రామంలో సొమరి దేవి అనే మహిళతో ఓ వ్యక్తికి వివాహం జరిగింది. దీంతో కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగిన కొన్నాళ్లకు భర్త మరణించాడు.

అయితే ఈ క్రమంలోనే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సోమరి దేవికి అదే గ్రామంలో కుంభకరన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఒకరినొకరు కలుసుకోవటంతో పాటు శారీరక సుఖాలు కూడా తీర్చుకున్నారు. ఇక ఆ మహిళ ఎలాగైన ఆ యువకుడిని ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కుంభకరన్ కి చెప్పటంతో ఆ మహిళతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ మహిళ కొత్త ఎత్తులను పన్నింది. నన్ను శారీరకంగా అనుభవించావని గ్రామంలో అందరికీ చెబుతానని అతడికి వార్నింగ్ ఇచ్చింది.

widow compressedదీంతో భయంతో ఊగిపోయిన మనోడు నిజంగానే చెబితే నా పరువు ఏమవుతుందనే ఆలోచనలో పడ్డాడు. ఇక ఎలాగైన ఆ మహిళతో పెళ్లి చేసుకోకుండా వదులుకోవాలనుకున్నాడు. ఏ చేయాలా అని ఆలోచిస్తూ చివరికి ఆ మహిళను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇక పథకం ప్రకారం ఓ రోజు ఓ చోటకు రామన్నాడు. నమ్మిన ఆ మహిళ రానే వచ్చింది. దీంతో ఆ మహిళ నన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుపట్టింది.

ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుంభకరన్ ఆ మహిళ చేతులు, కాళ్లు కట్టేసి స్థానిక బావిలో పడేసి హత్యచేశాడు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు కుంభకరన్ ని ప్రశ్నించారు. ఇక ఎంతకు నోరు విప్పకపోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో అడిగే సరికి నోరు విప్పి నేనే చంపానంటూ చెప్పాడు. ఇక అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.