నేటి సమాజంలో వైద్య వృత్తికి ఎంతో విలువుంది. కానీ కొందరు వైద్యులు ఆ పవిత్రమైన వృత్తిధర్మానికి తూట్లు పొడుస్తూ సభ్య సమాజం ముందు తలదించుకునేలా చేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడో ముసుగేసుకున్న డాక్టర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలో బాస్తీ మెడికల్ కాలేజ్‌లో ఉన్న హాస్పిటల్‌లో ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు డాక్టర్ జీడీ యాదవ్. పెళ్లై పిల్లలు కూడా ఉన్నాడు. అటు ఉద్యోగం ఇటు పెళ్లాం పిల్లలతో హాయిగా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతనికి ఫేస్ బుక్ ద్వారా ఓ పెళ్లైన మహిళ డాక్టర్ పరిచయమైంది. ఇద్దరూ చాటింగ్ లు మీటింగ్ లు అంటూ గడుపుతున్నారు.
అయితే ఈ డాక్టర్ నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పాస్తాను, నా వద్దకు వచ్చెయ్ అంటూ నమ్మబలికాడు. ఇతని మాటలను నమ్మిన ఆ వివాహిత తన భర్తను కాదని కుమారుడితో అతని వద్దకు వచ్చేసింది. మీర్జాపూర్‌కు చెందిన ఈ మహిళ డాక్టర్ నమ్మి కాన్పూర్‌లోని డాక్టర్ జీడీ యాదవ్ ఇంట్లో ఉంటూ ఐదేళ్లుగా అతనితో సహ జీవనం చేస్తూ వస్తుంది. ఇలా కొన్నళ్ల పాటు వీళ్లు వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగించారు. దీంతో కొంత కాలానికి ఆ మహిళ నన్ను పెళ్లి చేసుకోవాలని తెలిపింది. దీనికి నిరాకరించిన డాక్టర్ అసలు రూపాన్ని బయటపెట్టాడు.
పెళ్లి చేసుకోవాలని మహిళ తెలపటంతో అప్పటి నుంచి ఆమెను వేదించటం, కొట్టడం, తాగొచ్చి గొడవలు చేయటం చేసేవాడు. దీంతో ఇతడి మోసాలకు విసిగిపోయిన ఆ వివాహిత ఏకంగా అతడి ఇంటి ముందే కూరగాయలు అమ్ముతూ నిరసన తెలిపింది. వచ్చిపోయే వాళ్లు అడిగేసరికి అసలు విషయాన్ని అందరికీ పూస గుచ్చినట్లు తెలిపింది. ఇక స్పందించిన డాక్టర్ జేడీ యాదవ్ ఆవిడ నా ఆస్తిపై కన్నేసి నాతో ఉండాలని చూస్తోందంటూ తెలిపాడు. ఇక చివరికి ఆ వివాహిత డాక్టర్ జేడీ యాదవ్, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.