నా భార్యకు వరుడు కావాలంటు భర్త ప్రకటన! ఇదెక్కడి చోద్యం!

marriage

వేద పండితులు, పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. బంగారు భవిష్యత్తుకు బాటులు వేసుకోవాలనుకున్నారు. వారి బంధానికి గుర్తుగా ఒక కుమారుడికి జన్మనిచ్చారు. నూరేళ్లు అన్యోన్యంగా గడపాలనుకున్న వారు ఐదేళ్లకే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. వద్దనుకున్నాడు.. విడిపోవాలనుకున్నాడు.. కానీ పిచ్చి పని చేసి కటకటాల పాలయ్యాడు. తమిళనాడులో జరిగింది ఈ వింత ఘటన. ఏ భర్తా ఇలాంటి పని చేయడు.

ఇదీ చదవండి: టీ- ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఫ్యాన్స్ కి శుభవార్త.  కలసిపోయిన రోహిత్ శర్మ, కోహ్లీ!

పోలీసుల కథనం ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన యువతికి ఓంకుమార్‌(34)తో ఐదేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లు బాగానే గడిపిన ఈ జటం కొన్నాళ్ల నుంచి తరచూ గొడవ పడటం మొదలు పెట్టారు. ఇద్దరూ ఒకరినొకరు నిందించుకోవడం.. దూషించుకోవడం చేస్తున్నారు. వారి మధ్య దూరం మరింత పెరిగి అది విడాకుల వరకు దారి తీసింది. పెద్దలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆమెతో బంధం తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూదంమల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

marriageకోర్టులో విచారణ సాగుతుండగా ఓంకుమార్‌ ఓ దారుణమైన పని చేశాడు. అతని భార్య వివరాలను మ్యాట్రిమొనీలో ఉంచి.. వరుడు కావాలని పోస్ట్‌ చేశాడు. సంప్రదించాల్సిన వివరాల్లో ఆమె తండ్రి ఫోన్‌ నంబరు పెట్టాడు. ఓంకుమార్‌ అలా చేసిన సంగతి యువతి తరఫున వారికి ఎవరికీ తెలీదు. యువతి తండ్రికి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాం అంటూ ఫోన్లు రావడంతో అసలు విషయం తెలిసింది. ఎవరు ఇలా చేశారని ఆరా తీయగా ఓంకుమార్‌ ఇలా చేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓంకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పనికి ఒడిగట్టాడని తెలిసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఓంకుమార్‌ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.