పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద యంగ్‌ హీరో సాష్టాంగ నమస్కారం

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద పునీత్‌ అన్న కుమారుడు, యంగ్‌ హీరో యువ రాజ్‌కుమార్‌ సాష్టాంగ నమస్కారం చేశారు. ఆదివారం బాబయ్‌ సమాధిని సందర్శించేందుకు వచ్చిన యువ రాజ్‌కుమార్‌ మొదట సమాధికి నమస్కారించి.. అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ సాష్టాంగం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Star hero at Puneet Rajkumar Tomb - Suman TVరాజ్‌కుమార్‌ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువరాజ్‌కుమార్‌. ఇతను కూడా కన్నడ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. బాబాయ్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఇతనికి ఉందని పునీత్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. చాలా వరకు పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఉన్న లక్షణాలే యువరాజ్‌కుమార్‌కు ఉండడంతో అతన్ని పునీత్‌ అభిమానులు బాగా ఆదరిస్తుంటారు.