చైతు-సామ్ విడాకులపై మొదటిసారి స్పందించిన వెంకటేష్!

venkatesh

విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మూటగట్టుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే వెంకటేష్ ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించరనేది అందరికీ తెలిసిందే. అలా ఇలాంటి వాటికి దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ స్టోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో 5 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నామంటూ వీరిద్దరూ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నప్పటకీ వీరి అనేక చర్చల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్లు చైతు-సామ్ తెలిపారు. అయితే వీరి విడాకుల అంశంపై టాలీవుడ్ లో కొందరు నటీనటులు స్పందిస్తూ తమ భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

venkatesh insta storyఇక తాజాగా విక్టరీ వెంకటేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మనం నోరు తెరిచే ముందు మన మైండ్ తో ఆలోచించాలి అనేలా ఓ స్టోరీని పెట్టాడు. సమంత-నాగ చైతన్య విడాకుల విషయంలో ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తుండటంతో వెంకటేష్ ఈ విధమైన స్టోరీని పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ ఇన్ స్టాలో పెట్టిన ఈ స్టోరీపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.