ఈ మధ్యకాలంలో సినీతారలు సైతం వ్యాపార రంగం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వారికి ఇష్టమైన వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇంతకుముందు సినిమా హీరోలను కేవలం ప్రకటనల్లో మాత్రమే చూసేవారు అభిమానులు. కానీ ట్రెండ్ తో పాటు హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి.
మేము కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలి కదా.. అంటూ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. తాజాగా బిజినెస్ చేస్తున్న సినీ స్టార్స్ జాబితాలోకి విక్టరీ వెంకటేష్ కూడా చేరనున్నాడు. ఇంతకాలం వెంకీ ‘రామ్ రాజ్’, ‘మణప్పురం గోల్డ్’ లాంటి యాడ్స్ లో కనిపించాడు. కానీ ఈసారి వెనకుండి వ్యాపారం నడిపే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే వెంకీమామ బిజినెస్ లో అడుగు పెట్టేందుకు రెడీ అయిపోయాడా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు.
ఇంతకీ వెంకీ ఏ బిజినెస్ చేయనున్నారంటే.. అరుదుగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించే వెంకీ, ఇటీవల ఓ అడుగు ముందుకేసి ‘బైక్ వో’ అనే సంస్థతో చేతులు కలిపాడట. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు చార్జింగ్, సర్వీసింగ్ చేయడం వంటి సేవలందించే ఆ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ ఇకపై వెంకీ చేసుకోనున్నట్లు సమాచారం. మరి ఈ లెక్కన వెంకీమామ కూడా బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటే ఖుషినే అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వెంకీ ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. మరి వెంకీ మామ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.