బిగ్ బాస్ లోకి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి!

పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 15 తర్వలోనే ప్రారంభం కానుంది. ఈ షో కోసం నిర్వాహకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. దాదాపు ఇప్పటికే ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చింది బాలీవుడ్ బిగ్ బాస్ షో. అయితే బాలీవుడ్ బిగ్ బాస్ షో బాగా క్లిక్ కావడంతో ఇతర భాషల్లో ఈ రియాల్టీషోని తీసుకు వచ్చారు. తెలుగు లో ప్రస్తుతం సీజన్ 5 నడుస్తుంది.

biga boss minఇక బాలీవుడ్ లో ఇప్పుడు బిగ్ బాస్ లోకి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వర్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుశాంత్ మరణించిన తర్వాత ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని రియా చెబుతూ వస్తుంది. ఈ క్రమంలోనే గతంలో తనపై వచ్చిన ఆరోపణలలో అవి నిజం కాదని తనేంటో నిరూపించుకోవడం కోసం ఈ కార్యక్రమం తనకి ఒక ఒక మంచి వేదికగా మారబోతోందని రియా చక్రవర్తి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

suagj minఇందుకోసం రియాకి భారీ పారితోషకమే ఆఫర్ చేసినట్టు సమాచారం. రియా కొద్ది రోజులుగా వార్తల్లో, వివాదాల్లో ఉంది కాబట్టి తనని తీసుకొస్తే టిఆర్పి ఎక్కువగా వస్తుంది అని షో నిర్వాహకులు భావించారు. ఇందుకోసం ఆమెకు వారానికి 35 లక్షల పారితోషకం కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. షో రూల్స్ ప్రకారం బయట జీవితానికి సంబంధించిన విషయాలని షోలో మాట్లాడకూడదు. దాంతో రియా చక్రవర్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు షోలో ప్రస్తావించరు. తన రిలేషన్ షిప్ గురించి ప్రజలకు తెలియజేయడానికి రియాకు ఇది మంచి అవకాశమని బీటౌన్ లోని ప్రముఖులు చెబుతున్నట్లుగా టాక్. మరి బాలీవుడ్ బిగ్ బాస్ షో రియాకు కలిసి వస్తుందా లేదా చూడాలి.