‘రిపబ్లిక్’ మూవీపై సాయి ధరమ్ తేజ్ ట్విట్.. వైరల్

తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ కి ఫిజియో థెరపీ చేస్తున్నారని.. త్వరలో డిశ్చార్ చేస్తున్నారని అంటున్నారు.

rauge minఇదిలా ఉంటే 1వ తారీఖు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ మూవీ విషయంపై హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్విట్ లో స్పందించారు. నాపై..రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న ఆదరణ అభిమానం.. థ్యాంక్స్ చెప్పడానికి ఓ చిన్న పదం మాత్రమే, త్వరలో మీ ముందుకు వస్తా అంటూ సాయి ధరమ్ తేజ్ తన థంబ్ చూపిస్తూ.. ట్విట్ చేయడంతో.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడబానే ఉందన్న క్లారిటీ వస్తుంది.