ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

RRR Release Date Fix Jan 7th - Suman TV

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. ఇక డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలీయా భట్ నటిస్తున్నారు.

ఇక విషయం ఏంటంటే ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినా చిత్రీకరణలో ఆలస్యం కారణంగా విడుదల తేదీని మళ్లీ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో సినిమా రిలీజ్ కొత్త డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.