దుమ్మురేపుతున్న ‘కొండా’ పోస్టర్స్!

కోలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. కెరీర్ బిగినింగ్ లో మాఫియా, కామెడీ, హర్రర్ నేపథ్యంలో ఉన్న చిత్రాలు తీసేవారు. ముంబాయి షిఫ్ట్ అయ్యాక.. ఎక్కువ ఈ తరహా చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అక్కడ నుంచి తిరిగి టాలీవుడ్ కి వచ్చిన ఆయన ఇక రియల్ స్టీరీస్ పై ఫోకస్ పెట్టి బయోపిక్ లు తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం తీస్తున్న మూవీ కొండా.

gbae minతెలంగాణ రాజకీయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకతను సాధించిన కొండా దంపతుల నేపథ్యం ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. 1980 లో లవ్‌ స్టోరీ విత్‌ నక్సల్స్‌ బ్యాగ్రౌండ్‌ తో కొండా మూవీ తెరకెక్కుతోంది. వర్మ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో కొండా మురళి పాత్రను చాలా హైలెల్‌ గా చూపించారు. ఇప్పటికే సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించిన ఆర్జీవీ కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ కోసం LB కళాశాలలో సిబ్బంది, అధ్యాపకులను కలిసి కొంత సమాచారం సేకరించారు. వర్మ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కొండా మురళి కేరెక్టర్‌ను ఫుల్ అగ్రెసివ్ గా చూపించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే? అంటూ తీక్షణమైన చూపులతో ఉన్న హీరో కేరక్టరైజన్‌ పోస్టర్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్ లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్‌ లుక్‌తో కొండా మురళి కేరక్టర్ కనిపిస్తోంది.

konda2 minపోస్టర్‌లో బాటిల్‌తో తలపై నీళ్లు పోసుకుంటూ సీరియస్‌ లుక్‌లో ఉన్నాడు. చేతిలో తుపాకీ.. చుట్టూ నక్సల్స్.. ఇది మరో యాంగిల్‌. నాలుగైదు పోస్టర్స్‌లో అనేక యాంగిల్స్‌లో కొండా కేరక్టరైజేషన్‌ను చూపించారు వర్మ. ఇంకో పోస్టర్‌లో నుదుటికి ఎర్ర తువాలు కట్టుకుని.. చేతిలో తుపాకి పట్టుకుని తీక్షణమైన లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇలా, పోస్టర్స్‌తోనే కొండా మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు వర్మ. తాను చేసే సినిమాలపై ఎంతటి కాంట్రవర్సీలు వచ్చినా డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ ఉండటం ఆర్జీవీ స్పెషాలిటీ. మరి ఈ కొండా సినిమా పూర్తయ్యేలోగా ఎన్ని కాంట్రవర్సీలు వస్తాయో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.