ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి ఏంచేసినా అది సంచలనమే అవుతుంది. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో మంచు లక్ష్మి వచ్చీ రాని తెలుగుతో మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. కాని రాను రాను అది అందరికి అలవైటైంది. ఇక ఆ తరువాత సినిమాలు, బుల్లితెర షోలతో బాగా బిజీగా మారిపోయింది మంచు లక్ష్మి. అన్నట్లు మంచు లక్ష్మి ఈ మధ్య కొత్త విద్యలు నేర్చుకుంటోంది.
కేరళ రాష్ట్రానికి చెందిన ప్రాచీన విద్య కలరిపట్టులో మంచు లక్ష్మీ ట్రైనింగ్ తీసుకుంటోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటున్న వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఐతే ఇది సినిమా కోసమా, లేంటే ఫిట్ నెస్ కోసమా అన్నది మాత్రం మంచు లక్ష్మి చెప్పలేదు. ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న మంచు లక్ష్మీ, ఆ మూవీ కోసమే కలరిపట్టు విద్యను నేర్చుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మంచు లక్ష్మి కలరిపట్టు ట్రైనింగ్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. హేయ్ నీకు హద్దులనేవే లేవా.. నువ్ ఇలా చేయడం నేను నమ్మలేకపోతోన్నా.. ఇది ఎవరో చెప్పని వారికి లక్ష రూపాయలు ఇవ్వను.. అంటూ ఆర్జీవీ కామెంట్లు చేశాడు. ఆర్జీవీ చేసిన కామెంట్స్ పై మంచు లక్ష్మీ స్పందించింది. ఈ రోజుకు నా జీవితానికి ఇది నాకు చాలు.. మీరు నన్ను పొగిడేశారు.. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు.. నటిగా నేను ఏదైనా చేయగలను.. నేను ఎప్పుడూ చెప్పేవిధంగా నేను ఆర్టిస్టిక్ కిల్లర్‌నే.. అంటూ మంచు లక్ష్మీ ఆర్జీవీకి కామెంట్ కు రిప్లై ఇచ్చింది.
ఏదేమైనా మంచు లక్ష్మీ కలరిపట్టు విద్య ట్రైనింగ్ సెషన్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సధారనంగానే రాంగోపాల్ వర్మ ట్వీట్లు, మంచు లక్ష్మీ ట్రోల్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరు ఇలా ట్వీట్లతో దుమ్ములేపేయడంతో నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కలరిపట్టు విద్య నేర్చుకుని మంచు లక్ష్మి ఏంచేస్తుందో చూడాలి.
Awwwwww you made my whole life! Yes, your right there is NOTHING I cannot do as an artist. As I say, I call myself an artistic killer 💪🙌🏼💕 https://t.co/xpqFd6QOIR
— Lakshmi Manchu (@LakshmiManchu) December 9, 2021