ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద డైరెక్టర్ ఏంచేసినా సంచలనమే. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద సెటైర్లు వేయడమో, విమర్శలు గుప్పించడమో చేసే ఆర్జీవీ వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అవును ఎవరేమైపోతే నాకేంటి, నాకు వొడ్కా ఉంటే చాలని అనుకునే వర్మ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నారు. అదేనండీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో టాలీవుడ్ ప్రముఖులకు, వైసీపీ సర్కార్ పెద్దలకు మద్య వివాదం నడుస్తోంది కదా.
మరి రామ్ గోపాల్ వర్మకు ఏమైందో ఏమోగాని సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో కలగజేసుకున్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వరసు ట్వీట్స్ చేస్తున్నారు ఆర్జీవి. ఈ క్రమంలో వర్మకు, ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య ట్వీట్ వారు జరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో పరస్పరం శత్రువులుగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు, రామ్ గోపాల్ వర్మలు మళ్లీ ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు.
అవును మీరు విన్నది నిజమే. ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్లు చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగిన వీళ్లిద్దరు, ఇప్పుడు దోస్తులుగా మారారు. త్వరలో నాగబాబుని కలిసేందుకు రెడీ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టికెట్ రేటు విధానాలపై ఆర్జీవీ చెప్పింది పూర్తిగా నిజమే అని, తన నోటిలో నుండి వచ్చే ప్రశ్నలను వర్మ బయటపెట్టారని నాగబాబు కొనియాడుతూ ట్వీట్ చేశారు. దానిపై ఆర్జీవీ కూడా స్పందించారు.
సినిమా టికెట్స్ ఇష్యూపై నేను చేసిన ట్వీట్ పై నాగబాబు రెస్పాండ్ అయ్యారు.. నేను కూడా రెస్పాండ్ అయ్యా.. నాగబాబుతో నాకు మంచి రిలేషన్ ఉంది.. వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబో మూవీ చేస్తున్నప్పుడు నేను నాగబాబుని కలిశాను.. ఆయనేదో ఆవేశంతో స్టేజ్‌పై నన్ను ఏదో అన్నారు.. నేను వోడ్కా మత్తులో ఏదో అంటుంటా.. గతంలో ఇవన్నీ జరిగాయి.. నాగబాబుని నేను రెస్పెక్ట్ చేస్తున్నా.. లైక్ చేస్తున్నా.. లాజిక్ అనేది ఒక్కటే కనెక్టింగ్ ఫ్యాక్టర్.. టైంని బట్టి ఎమోషన్స్ మారతాయి. ఎమోషన్స్‌కి లాజిక్‌లు ఉండవు.. అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.
నాగబాబు ఎమోషన్స్‌తో మాట్లాడితే.. నేను వోడ్కా తాగి ఉన్నా.. నిజానికి వోడ్కా కూడా ఎమోషన్.. లాజికల్‌గా నాగబాబుతో నాకు జీరో పర్సంట్ కూడా ప్రాబ్లమ్ లేదు.. నాకు మెగా ఫ్యామిలీకి ఏదో ఉందని సోషల్ మీడియాలో వార్తలు ఉన్నప్పుడు కూడా.. నాగబాబు నన్ను అభినందించడాన్ని బట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నా.. త్వరలోనే ఆయన్ని కలుస్తా.. అంటూ వివరణ ఇచ్చారు ఆర్జీవీ. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏ మొహం పెట్టుకుని నాగబాబుని కలుస్తావ్ వర్మా.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబులపై నువ్ చేసిన పిచ్చి కామెంట్స్‌ని మేం మర్చిపోలేం.. అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి.
You’re absolutely right… And you took the questions right out of my mouth… @RGVzoomin https://t.co/OcePNWtnNj
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 4, 2022