రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ ఆర్జీవి.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు. తన చుట్టూ చోటు చేసుకునే అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఏపీలో ప్రారంభమైన సినిమా టిక్కెట్ల రేట్ల వివాదంతో రామ్ గోపాల్ వర్మ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రితో సహా.. మంత్రులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వర్మ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్మ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న రేంజ్ లో వివాదం నడుస్తోంది. అయితే తాజాగా నెలకొన్న ఈ పరిస్థితులపై టీడీపీ, జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మా వెంట పడ్డాడు.. ఇప్పుడు మీకు సరదా తీరుస్తున్నాడు.. బొమ్మ రివర్స్ అయ్యింది కదా.. వర్మతో ఇలానే ఉంటుంది అంటున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు.
ఇది కూడా చదవండి : వొడ్కా మత్తులో అలా చేశాను.. నాగబాబును కలుస్తా-ఆర్జీవీ
వర్మ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు, టీడీపీ, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకం. ఈ విషయాన్ని ఆయన తన మాటలు, చేతల్లో వెల్లడించడానికి ఏ మాత్రం మొహమాటపడలేదు. ఈ నేపథ్యంలోనే.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కిక్కించిన సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిలో ముఖ్యంగా చంద్రబాబు.. ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచారో ఎన్నికల ముందు మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చారు వర్మ. అంతటితో ఊరుకోక.. ఎన్నికల ఫలితాల అనంతరం మరో చిత్రాన్ని తెరకెక్కించారు. దీనిలో ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లను తనదైన శైలీలో ఆడుకున్నారు వర్మ. ఈ రెండు సినిమాలతో.. అటు మెగా ఫ్యామిలీ, ఇటు టీడీపీ, చంద్రబాబులపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. అప్పట్లో వర్మపై టీడీపీ కార్యకర్తలు, మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సయమంలో వైసీపీ కార్యకర్తలు.. వర్మకు మద్దతుగా నిలిచారు.
ఇది కూడా చదవండి : వాళ్లకు ఆర్జీవీతో బయోపిక్ తీయించుకునే దమ్ముందా- కొండా సురేఖ సవాల్
తాజాగా ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రస్తుతం వర్మ పేరు చెబితేనే.. కస్సుమంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇందుకు ప్రధాన కారణం.. ఏపీలో టికెట్ ధరల అంశంలో వర్మ కలగజేసుకోవడమే కాక.. వైసీపీ మంత్రులపై సెటైర్లు వేయడం. ప్రస్తుతం ఈ విషయమై వర్మకు, ఏపీ మంత్రులకు ట్వీటర్ వార్ నడుస్తోంది. ఇదే సమయంలో మరో ఊహించని షాక్ ఇచ్చారు వర్మ. మెగా ఫ్యామిలీపై ప్రేమను కురిపించి.. తను ఎవరికి అర్థం కానని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబుపై తన ప్రేమను వ్యక్తం చేశారు వర్మ. గతంలో ఆవేశంలో నాగబాబు తనను ఏదో అన్నారని.. తాను వోడ్కా మత్తులో నాగబాబు గురించి ఏదో మాట్లాడనని.. కానీ ఇప్పుడు నాగబాబుని నేను రెస్పెక్ట్ చేస్తున్నా.. లైక్ చేస్తున్నా.. లాజిక్ అనేది ఒక్కటే కనెక్టింగ్ ఫ్యాక్టర్.. టైంని బట్టి ఎమోషన్స్ మారతాయి. ఎమోషన్స్‌కి లాజిక్‌లు ఉండవు.. అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఈ సారి వైసీపీ కార్యకర్తలు వర్మపై విమర్శలు చేస్తుండగా.. టీడీపీ, మెగా అభిమానులు మాత్రం మద్దతిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : ఏపీ సినిమా టికెట్స్ విషయంలో కీలక మలుపు! RGV వల్ల పరిష్కారం రాబోతోందా?