బిగ్ బ్రేకింగ్: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి లెటెస్ట్ అప్ డేట్

rrr movie postponed

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ అగ్రహీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరు బడా హీరోలు కలిసి నటించటం, పైగా రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చివరి దశలో ఉండటం విశేషం. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పుడు అసలు విషయమేంటంటే..? గతంలో ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని రాజమౌళి ఎప్పుడో ప్రకటించి ఆ దిశగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.

rrr movie postponedకానీ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోకపోవటంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేయలేమని,త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది మూవీ యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడటంతో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.