Rajamouli: రాజమౌళిపై కేసు పెట్టండి! అసలు కారణం ఏమిటంటే?

RRR

దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ పేరు ఎంతో మందికి ఆదర్శం. పాన్‌ ఇండియా అనే ఒక కాన్సెప్ట్‌ కు ఆధ్యం పోసిన వ్యక్తి రాజమౌళి. అంతేకాకుండా టాలీవుడ్‌ లో ఇద్దరు బిగ్గెస్ట్‌ స్టార్‌ హీరోలు తారక్రామ్ చరణ్ లను పెట్టి ట్రిపులార్‌ అనే అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందిచారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,129.30 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డులు సృష్టించింది. అయితే అలాంటి స్టార్‌ డైరెక్టర్‌ పై కేసు పెట్టాలంటూ ఓ వ్యక్తి ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశాడు. ఆ ట్వీట్‌ కు సైబారాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేసి కేసు పెట్టాలని కోరాడు. అందుకు సైబారాబాద్‌ సిటీ పోలీసులు సైతం స్పందించి.. అతని ట్వీట్‌ కు రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదీ చదవండి: అదిరిపోయిన వెంకటేష్, వరణ్ తేజ్ ల ‘F3’ ట్రైలర్!

అయితే రాజమౌళిపై కేసు పెట్టాలనే డిమాండ్‌ బయట ప్రపంచానికి సంబంధించి కాదులెండి. ట్రిపులార్‌ సినిమా విషయంలో రాజమౌళి ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించాడు అనేది ఆ ట్వీట్ చేసిన వ్యక్తి వాదన. క్లైమాక్స్‌ సీన్‌ లో తారక్‌ బైక్‌ పై వేగంగా వచ్చి దానిని కోటలోకి విసురుతాడు. బాణంతో ఆ బైక్‌ కు నిప్పు పెట్టి రామ్‌ చరణ్‌ పేల్చేస్తాడు. ఒకరకంగా సినిమాలో రామ్‌- భీమ్‌ గెలవడానికి అదే కీలకమైన షాట్‌. ఆ సీన్‌ లో తారక్‌ వాడిన బైక్‌ కు ఒకే సీన్‌ లో రెండు నంబర్లు పెట్టారు. ముందువైపు DL 5079 అని ఉండగా.. వెనుక నంబర్‌ ప్లేట్‌ పై మాత్రం DL 1030 అని ఉంది. ఆ రెండు స్క్రీన్‌ షాట్స్‌ పెట్టి సదరు వ్యక్తి రాజమౌళిపై కేసు పెట్టండి అంటూ డిమాండ్‌ చేశాడు.RRRఒక వ్యక్తి ఇలా ఒకే బండికి రెండు నంబరు ప్లేట్లు పెడితే ఎలా సార్‌ అంటూ రాజమౌళి ప్రశ్నిచాడు. ఆ ట్వీట్‌ ను రీట్వీట్‌ చేస్తూ మరో వ్యక్తి సైబారాబాద్‌ పోలీసులు కేసు పెట్టాలంటూ డిమాండ్‌ చేశాడు. అతని ట్వీట్‌ పై సైబారాబాద్‌ సిటీ పోలీసులు స్పందిస్తూ.. ‘దయచేసి ప్లేస్‌, ఆ తేదీ, సమయం తెలియజేయండి’ అంటూ సైబారాబాద్ పోలీసులు ట్వీట్‌ కు సమాధానమిచ్చారు. అంటే ఆ తేదీ, ప్లేస్‌, టైమ్‌ చెప్తే కేసు పెడతామంటూ స్పందించారనమాట. ఇప్పుడు ఆ ట్వీట్‌, రిప్లై రెండూ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. కొందరు ఆ బండి ఉంది ఢిల్లీ కాబట్టి అక్కడి పోలీసులను ట్యాగ్‌ చెయ్యి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఒకే బండికి రెండు నంబరు ప్లేట్లు పెట్టినందుకు రాజమౌళిపై కేసు పెట్టాలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.