న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!

nani movie

న్యాచురల్‌ స్టార్‌ నాని టక్‌ జగదీశ్‌ వివాదం బాగానే నడిచింది. నానీవి రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యి మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. టక్‌ జగదీశ్‌ డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్‌ చేసినందుకు థియేటర్ల యాజమాన్యం చాలానే రచ్చ చేశాయి. నాని సినిమాలను థియేటర్లలో బ్యాన్‌ చేస్తామంటూ హెచ్చరించారు. అందుకు నాని కూడా చాలా భావోద్వేగంగా రియాక్ట్‌ అయ్యాడు. కానీ, సినిమా రిలీజ్‌ తర్వాత థియేటర్ల యాజమాన్యాలు నాని, సినిమా యూనిట్‌కు క్షమాపణ చెబుతూ లేఖ రాశాయి. పరిస్థితులు బాగున్నప్పుడు తన సినిమా ఎప్పుడూ నేరుగా ఓటీటీకి రాదని నాని మాటిచ్చాడు.

nani movieఅసలు విషయం ఏంటంటే ఇప్పుడు నాని తర్వాతి సినిమా శ్యామ్‌ సింగరాయ్‌కి కూడా ఓటీటీ కంపెనీల నుంచి చాలా పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ సినిమాని బిగ్‌ స్క్రీన్‌పైనే రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపారు. ఇక థియేటర్‌లో రిలీజ్‌ అయ్యాక ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది కాబట్టి. ఆ అవకాశాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజ్‌ అయ్యాక పరిమిత సమయం తర్వాతనే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని తెలుస్తోంది. టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పిరియాడికల్‌ కమ్‌ సోషల్‌ డ్రామాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆలస్యమయ్యేలా ఉంది. ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం బిగ్‌ స్క్రీన్‌ రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.