నాగచైతన్య 'కస్టడీ' ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్ అయిపోయింది. మరోవైపు స్ట్రీమింగ్ తేదీ కూడా అప్పుడే ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
నాగచైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. టాక్ సంగతి గురించి కాస్త పక్కనబెడితే అక్కినేని ఫ్యాన్స్ కి మరోసారి బాధపడుతున్నారు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా అక్కినేని హీరోలకు అస్సలు కలిసి రావట్లేదు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ఇలా అందరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఇప్పుడు ‘కస్టడీ’ దాన్ని బ్రేక్ చేస్తుందనుకున్నారు కానీ అది జరిగేలా కనిపించట్లేదు. తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఆసక్తికరంగా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏదైనా మూవీ, థియేటర్ లో రిలీజైతే చాలు అది టీవీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు. ఇప్పుడు టైమ్ మారిపోయింది. నెల-నెలన్నర కంటే ముందే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ఏదైనా కొత్త మూవీ రిలీజ్ కావడం లేటు. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది ప్రేక్షకులు కనిపెట్టేస్తున్నారు. టాక్ బట్టి అది తెలిసిపోతోంది. ఇప్పుడు ‘కస్టడీ’ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్ కావడంతో.. ఓటీటీలో విడుదల ఎప్పుడనేది అంచనాకు వచ్చేశారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం ‘కస్టడీ’ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాక్ ఎలానూ యావరేజ్ వచ్చింది. మరోవైపు ఈ వీకెండ్ గడిస్తే ఈ మూవీ స్టామినా ఏంటనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం పరిస్థితి బట్టి చూస్తుంటే.. జూన్ తొలి వారం లేదా రెండో వారం కల్లా ‘కస్టడీ’ ఓటీటీలోకి వచ్చేయడం పక్కా అని తెలుస్తోంది. రీసెంట్ గా ‘రావణాసుర’, ‘దసరా’, ‘శాకుంతలం’.. అలా నెల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. ‘కస్టడీ’ వీటికి ఏ మాత్రం మినహాయింపు కాదని తెలుస్తోంది. చూడాలి మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో? మరి మీలో ఎవరైనా ‘కస్టడీ’ చూస్తే.. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.