మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
తెలుగులో హారర్ సినిమాలు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటారు. అయితే సీరియస్ హారర్ మూవీ వచ్చి చాలా ఏళ్లయింది. రీసెంట్ గా వచ్చి ఆ లోటుని భర్తీ చేసిన చిత్రం అంటే చాలామంది చెప్పే పేరు ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు ఎలాంటి అంచనాల్లేవు. కానీ అనుహ్యంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత జనాలకు తెగ నచ్చేసింది. దీంతో కలెక్షన్స్ గట్టిగానే వచ్చాయి. స్టిల్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇప్పుడు దీనిని ఓటీటీ రిలీజ్ ని ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ తర్వాత మనకు ఓటీటీలు బాగా అలవాటైపోయాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెగ చూసేశారు. అలా కొన్నాళ్లకు తెలుగులోనూ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు చేశారు. కానీ వాటి వల్ల థియేటర్లకి జనాలు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. దీంతో 6-8 వారాల తర్వాతే థియేటర్లలో రిలీజైన సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని తీర్మానించుకున్నారు. ఇప్పుడు దాన్ని ఒక్కరు కూడా పాటించడం లేదు. చిన్న పెద్ద సంబంధం లేదు. అన్నీ కూడా నెలలోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.
రీసెంట్ గా అలా థియేటర్లలో టాక్ తో సంబంధం లేకుండా ‘దసరా’, ‘శాకుంతలం’, ‘రావణాసుర’ సినిమాలు నెలలోపే వచ్చేశాయి. ‘ఏజెంట్’ అయితే మూడు వారాల్లోనే రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ‘విరూపాక్ష’ కూడా చేరింది. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మే 21న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ‘విరూపాక్ష’ని ఓటీటీలో చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి.
#Virupaksha to stream on #Netflix from May 21, 2023.#AjaneeshLokanath Musical pic.twitter.com/zFEWrOtGdF
— Filmy Corner (@filmycorner9) May 16, 2023