హీరోగా సినిమాల్లో తన నటవిశ్వరూపం చూపించే బాలయ్య ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తనున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఒక సరికొత్త టాక్ షోకు యాంకర్‌గా చేయనున్నట్లు సమాచారం. బ్లాక్‌బస్టర్ సినిమాలు, అదిరిపోయే సిరీస్‌లు, అలరించే టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ.. 100 శాతం తెలుగు ఓటీటీగా డిజిటల్ రంగంలో చెరుగని ముద్ర వేసింది ‘ఆహా’. ఈ పాపులర్ ఓటీటీ నటసింహంతో ఓ స్పెషల్ టాక్ షో ప్లాన్ చేస్తోందని సమాచారం.
ఫస్ట్ టైం బాలయ్య హోస్టింగ్ చెయ్యబోతున్నారు. : టాలీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతో ఇప్పటికే పెద్ద లిస్ట్ రెడీ చేసారట ‘ఆహా’ టీం. బాలయ్య స్టైల్లో ఎనర్జిటిక్‌గా సాగే ఈ టాక్ షోకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ పంచ్ డైలాగ్‌లు, వెరైటీ డాన్స్‌లు, భీకరమైన ఫైట్లు, ఎమోషనల్ సీన్లలో బాలయ్యను చూసిన ఫ్యాన్స్ ఇకపై సెలబ్రటీలను ఇరకాటంలో పెట్టే, సరదాగా నవ్వించే, వారి గురించి ఎవరికీ తెలియని విషయాలు రాబట్టే ప్రశ్నలతో ప్రేక్షకులకు వినోదం పంచే కొత్త బాలయ్యను చూడబోతున్నారు.