పవన్ నన్ను మెల్లగా లాగావ్.. పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు చురక

mohanbabu pawankalyan tollywood

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి రెపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మోహన్ బాబుపై కాస్త ఘాటుగానే స్పందించాడు. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ ని నాన్ లోకల్ అంటూ కొందరు మాట్లాడుతున్నారని, భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైన పోటీ చేయొచ్చని ప్రకాశ్ రాజ్ కు ఆ హక్కు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఇదే కాకుండా వైఎస్ కుటుంబికులు మోహన్ బాబుకి బంధువులని చెబుతుండటం నేను విన్నానని, సీఎం జగన్ కి చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండంటూ మోహన్ బాబుకు పవన్ సూచింంచారు. ఇక మోహన్ బాబు కూడా ఏపీలోని థియేటర్ల ఓపెనింగ్ గురుంచి మాట్లాడాలన్నారు జగన్ తో మాట్లాడాలన్నారు.

ఇక జగన్ మోహన్ రెడ్డి, మోహన్ బాబు తేల్చోకోండని అన్నారు. మీరు కూడా సినిమా పరిశ్రమపై మాట్లాడాలి, ఎందుకంటే మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు కాబట్టి, మీకు అడగటానికి నైతిక బాధ్యత ఉందని తెలిపారు. ఇక ఇప్పుడు చిత్ర పరిశ్రమకు అప్లయ్ చేసిన రూల్ రేపటి రోజుల్లో మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లయ్ చేయవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక దీనిపై స్పందించారు సీనియర్ నటుడు మోహన్ బాబు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన పవన్ కు కాస్త చురకలు అంటించారు.

pawankalyan mohanbabu tollywood

నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకే నిన్ను ఏకవచంనంలో సంబోందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనటంలో తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. కానీ వచ్చే నెల 10న మా ఎన్నికలు ఉన్నాయి. నా కుమారుడైన మంచు విష్ణు మా ఎన్నికల్లో అధ్యక్ష్య పోటీలో ఉన్న సంగతి నీకు తెలుసు. ఇక మీరు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం మా ఎన్నికలు జరిగిన వెంటనే చెబుతాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే..? నీ అముల్యమైన ఓటు వేసి నీ సోదరసమానుడైన మంచు విష్ణుని, అతని ప్యానెల్ ని గెలింపిచాలని మోహన్ బాబు పవన్ కళ్యాణ్ కి సూచించాడు.