శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందించిన మంచు విష్ణు!

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. శివ శంకర్‌ మాస్టర్‌ మాత్రమే కాకుండా ఆయన మిగతా కుటుంబ సభ్యులు భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు.

image 1 compressed 19పెద్ద కుమారుడు సైతం కరోనా బారిన పడి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన భార్య హోంక్వారంటైన్‌లో ఉండగా కుమారుడు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భారీగానే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి వైద్య చికిత్సలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్‌ అర్జించాడు. అది తెలిసి ఆయనకు వైద్యం అందించేందుకు ఇప్పటికే నటుడు సోనూసూద్‌, తమిళ హీరో ధనుష్‌ ముందుకు వచ్చారు.

image 2 compressed 19తాజాగా సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు. అంతేకాదు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాడి ధైర్యం చెప్పాను. అలాగే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చారు.