నాగార్జున – యన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య టీఆర్పీ వార్! అసలు కింగ్ ఎవరు?

Nagarjuna Between NTR TRP Rating War - Suman TV

జూనియర్ యన్టీఆర్.. మల్టీ టాలెంటెడ్ హీరో. వెండితెరపై రికార్డ్స్ బద్దలు కొట్టాలన్నా, బుల్లితెరపై కొత్త రికార్డ్స్ సృష్టించాలన్నా ఆయనకే సాధ్యం. తెలుగులో బిగ్ బాస్ షోకి సేఫ్ లాంచింగ్ ఇచ్చింది కూడా తారకే. తరువాత కాలంలో వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో యన్టీఆర్ బుల్లితెరకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే.., ఇప్పుడు స్మాల్ గ్యాప్ తరువాత జూనియర్ యన్టీఆర్  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ నాలెడ్జ్ షోని తారక్ తన హోస్టింగ్ తో ఆసక్తికరంగా మార్చేశాడు. హాట్ సీట్లో ఉన్న కంటెస్టెంట్ తో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారిలో ఉన్న ఎమోషన్స్ ని బయటకి తీస్తూ.., తారక్ అద్భుతంగా షోని రన్ చేస్తున్నాడు. దీంతో.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి రికార్డ్స్ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ ప్రీమియర్ ఎసిపోడ్.. 11.40 రేటింగ్ సాధించగా,  ఫస్ట్ వీక్.. 5.62 రేటింగ్,  రెండో వారం 6.48 రేటింగ్ సాధించి తగ్గేదే లే అన్నట్టు రేటింగ్స్ లో దుమ్ము లేపేస్తోంది. అయితే.., ఇప్పుడు ఈ టీఆర్పీ రేటింగ్స్ నాగార్జున – యన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్ కి కారణం అయ్యాయి.

Nagarjuna Between NTR TRP Rating War - Suman TVగతంలో అక్కినేని నాగార్జున ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్స్ గా వ్యవహరించారు. కానీ.., ఆ సమయంలో  టీఆర్పీ రేటింగ్ చాలా దారుణంగా వచ్చాయి. ఇప్పుడు అదే షోకి తారక్ రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్స్ తీసుకొస్తుండటంతో యన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంపారిజన్స్ తీసుకొస్తున్నారు. బుల్లితెర హోస్టింగ్ కింగ్ యన్టీఆర్ అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. జెమిని టీవీ ఓవరాల్ రేటింగ్ కూడా భారీగా పెరిగి.., మా టీవీని బీట్ చేయడంతో యన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కానీ.., ఇక్కడే నాగ్ ఫ్యాన్స్ బిగ్ బాస్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. బిగ్ బాస్ రేటింగ్స్ రిలీజ్ అయితే.. అప్పుడు ఎవరి సత్తా ఏమిటి అర్ధం అవుతుంది అంటూ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. నిజానికి..‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి వచ్చిన ఈ 6.48 రేటింగ్..  బిగ్ బాస్ ముందు తక్కువే. అయినా.. గతంలో ఈ షోకి అసలు రేటింగ్స్ రాకపోవడం, తారక్ వచ్చాక పరిస్థితిలో మార్పు రావడం.. యన్టీఆర్ అభిమానుల హంగామాకి కారణం. మరి.. ఈ టీఆర్పీ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.