నాగ చైతన్య-సమంత విడాకులపై అమీర్ ఖాన్ కీలక పాత్ర?

kangana ranaut

గత కొంత కాలం నుంచి సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చింది లేదు. దీంతో వారు విడాకుల అంశంపై స్పందించకపోవటంతో వస్తున్న వార్తలకు కాస్త బలం చేకూరినట్లు అయింది. అయితే శనివారం అనేక చర్చల మధ్య నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నామంటూ ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు.

అవును మేము విడిపోతున్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. వివాహ బంధంతో విడిపోతున్నా భవిష్యత్ లో స్నేహితులతో కలిసే ఉంటామంటూ తెలిపారు. అయితే దీనిపై నాగార్జున కూడా భావోద్వేగంతో స్పందిస్తూ ఇలా జరగటం చాలా బాధాకరం అంటూ తెలిపారు. దీంతో సినీ నటులు ఒక్కొక్కరుగా వీరి విడాకులపై స్పందిస్తూ ఉన్నారు.

kangana ranautఅయితే తాజాగా స్పందించారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఇక రియాక్ట్ అవ్వటమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్-చైతు విడాకులు తీసుకోవటంతో చైతన్య బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సలహాతో విడాకులు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదే కాకుండా చైతన్య, సమంత భార్యాభర్తల బంధం విడాకులకు దారి తీస్తే దానికి ఖచ్చితంగా కారణం పురుషులేనంటూ కంగనా తెలిపింది.