టాలీవుడ్ లో విషాదం: జూనియర్ యన్టీఆర్ PRO, నిర్మాత మహేశ్ కోనేరు మృతి!

టాలీవుడ్ లో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో, అంతకముందు ఇండస్ట్రీ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా తరువాత కూడా ఈ వరుస మరణాలు ఆగడం లేదు. తాజాగా స్టార్ పి.ఆర్.ఓ, నిర్మాత మహేశ్ కోనేరు గుండె పోటుతో మరణించారు. ఇండస్ట్రీలో ఓ సాధారణ వ్యక్తిలా ఎంటర్ అయిన మహేశ్ కోనేరు.. తరువాత కాలంలో నందమూరి హీరోల అభిమానాన్ని, నమ్మకాన్ని దక్కించుకోగలిగారు.

Jr NTR PRO Mahesh Koneru Died - Suman TVఇక జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి మహేశ్ కోనేరు ఇంటి సభ్యుడు కిందే లెక్క. నందమూరి హీరోలు నటించిన అధిక చిత్రాలకి మహేశ్ కోనేరు పి.ఆర్.ఓ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తారక్, కళ్యాణ్ రామ్ కి ఈయన పర్సనల్ పి.ఆర్.ఓ కూడా. నందమూరి కుటుంబంతో ఇంతటి బంధం ఉంది కాబట్టే మహేశ్ కోనేరు నిర్మాతగా కళ్యాణ్ రామ్ తో “118” అనే చిత్రాన్ని సైతం నిర్మించారు. ఇంతటి నమ్మకస్తుడైన ఆప్తుడు ఒక్కసారిగా దూరం అవ్వడంతో తారక్, కళ్యాణ్ రామ్ తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. మరి.. మహేశ్ కోనేరు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.