మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో అద్భుతం! కోటి రూపాయలు గెలుచుకున్న కంటెస్టెంట్!

మీలో ఎవరు కోటీశ్వరుడు.. యన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు ఈ షో వేదికగా ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. నిజమే..ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ఈ అద్భుతం జరిగింది. అయితే.. ఈ కోటి గెల్చుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు అంతా అతని డీటైల్స్ కోసమే గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న విజేత పేరు రాజా రవీంద్ర అని తెలుస్తుంది. ఇతను తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెంకి చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అట. అంతేకాదు గన్ షూటింగ్ లో ఇతను నేషనల్ లెవెల్ ప్లేయర్ గా తెలుస్తోంది.

Jr NTR EMK 1st 1 Cr Winner - Suman TVఒలంపిక్స్ లో ఎయిర్ రిఫిల్ విభాగంలో పాల్గొని గెలవాలన్నది రాజా రవీంద్ర లక్ష్యం. దాని కోసమే తన ప్రైజ్ మనీని ఉపయోగిస్తాడట రాజా రవీంద్ర. ఈ ఉన్నతమైన లక్ష్యానికి తాను కూడా అండగా నిలుస్తానని తారక్ అతనికి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి.. సామాన్యుడిని కోటీశ్వరుడిన్ని చేసిన.. తారక్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.