జాన్వీ క‌పూర్ అందాల ఆర‌బోత‌.. వీడియో వైర‌ల్

భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు నటి శ్రీదేవి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంతో హీరోయిన్ గా మారారు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయారు.

JAVE minప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి..  జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లకు జన్మనిచ్చారు. అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలనే కోరికతో ఉన్న ఆమె అనుకోకుండా దుబాయ్ లో కన్నుమూశారు. ఆమె మరణించిన తర్వాత జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ అమ్మడు నటించిన చిత్రాలు కొన్ని అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. జాన్వీ కపూర్ సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

JANVI minఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోల‌ను అంద‌రితో పంచుకుంటుంది. తాజాగా జాన్వీక‌పూర్ మాల్దీవుల కు వెళ్లిన‌పుడు సంద‌డి చేసిన త్రోబ్యాక్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేను మాన‌సికంగా ఇక్క‌డున్నాను.. అంటూ తిమింగ‌లం ఐకాన్ ను క్యాప్ష‌న్ గా పెట్టింది. సిల్వ‌ర్ క‌ల‌ర్ బికినీ జాన్వీ అందాలు చూస్తుంటే కుర్రాళ్లకు మతులు పోయేలా ఉన్నాయి. త‌న కురుల‌తో విన్యాసం చేస్తున్న స్లో మోష‌న్ వీడియో ఇపుడు నెట్టింట హీట్ పుట్టిస్తోంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ఓ ట్రావెల్ మ్యాగజైన్   ఫొటోషూట్ కోసం మాల్దీవుల‌కు వెళ్లింది జాన్వీక‌పూర్.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)