ఆర్యన్ ఖాన్ కి ధైర్యం ఇచ్చిన హృతిక్ రోషన్.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్..

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ కొడుకు ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్‌ డ్రగ్స్, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్‌ యాక్ట్‌ 1985 (ఎన్‌డీపీఎస్‌) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్‌సీబీ నమోదు చేసింది. ఆర్యన్ ఖాన్​తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్​మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ పై సర్వత్రా ఆందోళన మొదలైంది.

asg min 1ఇదిలా ఉంటే బాలీవుడ్ లో తమ సహనటుడి తనయుడు డ్రగ్స్ కేసు విషయంలో పట్టుబడిన వార్త తెలిసిన తర్వాత షారూఖ్ ఖాన్ ఇంటికి సెలబ్రెటీల తాకిడి ఎక్కువైంది. పలువురు స్టార్ హీరోలు ఆర్యన్ ఖాన్ కి ధైర్యం చెబుతున్నారు.. షారూఖ్ ఖాన్ ని ఓదారుస్తున్నారు. తాజాగా క్రిష్ హీరో హృతిక్ రోషన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యిన బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌కు మ‌ద్ద‌తుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు హృతిక్ రోష‌న్‌. ఇన్ స్ట్రా వేధికగా ‘ప్ర‌శాంతంగా ఉండు.. ప్ర‌తి అనుభ‌వం నుంచి నేర్చుకో.. ఈ క్ష‌ణాలే నీ రేప‌టిని త‌యారు చేస్తాయి అని ఆర్య‌న్‌కు ధైర్యం చెబుతూ హృతిక్ చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

మన జీవితం అనేది ఓ ప్రయాణం లాంటిది.. నీకొచ్చిన క‌ష్టం చూసి తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నావ‌ని తెలుసు. కోపం, అయోమయం, నిస్స‌హాయ స్థితిలో ఉన్నావు. వీటినే జ్వ‌లింప‌జేసి నీలోని హీరోని బ‌య‌ట‌కు తీసుకురావాలి. నువ్వు ఏది గుర్తుంచుకోవాలి, ఏది వదిలేయాలి అనుకుంటావో దానిని బ‌ట్టి త‌ప్పుడు, వైఫ‌ల్యాలు, విజ‌యాలు అన్నీ స‌మాన‌మే’ అంటూ ఆర్యన్ ఖాన్ కి తన మద్దతు తెలిపారు హృతిక్ రోషన్.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)