‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారి కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర రికార్డ్ క్రియేట్ చేశారు. రాజా రవీంద్రది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సై గా జాబ్ చేస్తున్నారు. అయితే.. “ఎవరు మీలో కోటీశ్వరుడు” గేమ్ లో హాట్ సీట్ పై ఉండగా.. రాజా రవీంద్ర హోస్ట్ జూనియర్ యన్టీఆర్ తో చాలా విశేషాలను పంచుకున్నారు.
ఈ సమయంలో.. మీరు ఎప్పటి వరకు ఛేదించిన కేసుల్లో.. బాగా కష్టం అనిపించింది ఏది అని తారక్ ప్రశ్నించారు. దానికి.. రాజా రవీంద్ర దృశ్యం సినిమాని పోలిన ఓ కేసుని తాము ఛేదించామని సమాధానం ఇచ్చాడు. కానీ.., షోలో ఆ కేసు డీటైల్స్ మాత్రం రివీల్ చేయలేదు. కాగా.. ఇప్పుడు రాజా రవీంద్ర సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసు వివరాలను బయటపెట్టారు ఎస్సై రాజా రవీంద్ర.
ఎక్కడో మర్డర్ జరిగితే.. బాడీని తీసుకొచ్చి మా స్టేషన్ పరిధిలో పడేసి వెళ్లారు. ముందు బాడీని సరిగ్గా ఐడెంటిటీ చేసి, బంధువుల వివరాలను కనుక్కోవడానికి మాకు చాలా సమయం పట్టింది. చివరికి చనిపోయిన వ్యక్తి భార్యని కలుసుకున్నాము. ఆవిడ దగ్గర కూడా సరైన సమాచారం లేదు. కానీ.., భర్త కనిపించకుండా పోయిన పక్కరోజు.. లోకల్ పోలీస్ స్టేషన్ లో అతని భార్య కంప్లైంట్ చేసింది. ఆ కేసు వివరాలు పరిశీలిస్తే.. చనిపోయిన వ్యక్తి తన స్నేహితుడిని కలవడానికి బయటకి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పినట్టు నమోదు అయ్యింది.
ఆ స్నేహితుడిని వెతుక్కుంటూ పోతే అతను అస్సలు అనుమానంగా అనిపించలేదు. అతని తిరిగిన మొత్తం లొకేషన్స్ కి, అతను చెప్తున్న మాటలకి సరిగ్గా సరిపోతుంది. కానీ.., అతను ట్రైన్ లో ప్రయాణించినట్టు ఓ అబద్దం చెప్పాడు. అక్కడ నుండి మొత్తం కేసు ఓ కొలిక్కి వచ్చిందని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.