ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు. ఈ పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్సీబీ వెల్లడించింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే రేవ్ పార్టీ ఎవరు జరిపించారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో పట్టుడిన తర్వాత షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముఖంలో భయం కనిపిస్తుంది. విచారణ చేస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొడుకుతో షారూఖ్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడే ఛాన్స్ వచ్చిందట. అయితే నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్ సీబీకి ఆర్యన్ చెప్పినట్లు సమాచారం. విదేశాల్లో కూడా ఇతను డ్రగ్స్ తీసుకొనే వాడని ఎన్ సీబీ అంటోంది.
ఇక డ్రగ్స్ చట్టం ప్రకారం చూస్తే.. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ లోని 8(సి) సెక్షన్ కింద ఆర్యన్ ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసినా, తయారు చేసినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్టానికి దిగుమతి చేసినా, ఎగుమతి చేసినా, దేశం నుంచి బయటికి ఎగుమతి చేసినా, బయటి నుంచి దేశంలోకి దిగుమతి చేసినా.. విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, వినియోగించినా శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇక షారూఖ్ తనయుడు ఆర్యన్ కి చట్ట ప్రకారం ఏ విధమైన శిక్ష పడుతుందన్న విషయం పై చర్చ నడుస్తుంది.
డ్రగ్స్ కేసులో పట్టబడితే..చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకూ కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. shahrukhఇక NDPS యాక్ట్ సెక్షన్ 20(బి) ప్రకారం గంజాయిని కలిగి ఉండటం శిక్షార్హమైన నేరం. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం మత్తుమందు తీసుకోవడం నేరం. ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే గంజాయి నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేయడం నేరం. గంజాయి వాడితే పదేళ్ల వరకు పొడిగించే కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ లెక్కన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ కి ఏ శిక్ష పడుతుందో అని టెన్షన్ ఉన్నారు.