బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీటర్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. మా వాడు గొప్ప అంటే.. మా వాడు గొప్ప అంటూ.. ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఈ మధ్య వచ్చిన ట్రెండ్ కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తునే ఉంది. అయితే తాజాగా ఓ ఇద్దరు సెలబ్రిటీల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్దమే జరుగుతోంది. అవును బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీటర్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. మా వాడు గొప్ప అంటే.. మా వాడు గొప్ప అంటూ.. ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ-షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య ట్వీటర్ లో వార్ కొనసాగుతోంది. విరాట్ కంటే షారుఖ్ గొప్ప అని షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అంటుంటే.. షారుఖ్ కన్నా మా వాడు తోపు అని కోహ్లీ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదని షారుఖ్ అభిమానులు అనగా.. వరల్డ్ లో ఉత్తమ నటుడు ఎవరు అని వెతికితే షారుఖ్ పేరు రావడంలేదు.. కానీ బెస్ట్ క్రికెటర్ ఎవరు అని సెర్చ్ చేస్తే విరాట్ కోహ్లీ పేరు వస్తుంది అని కౌంటర్ ఇచ్చారు విరాట్ ఫ్యాన్స్. అదీకాక షారుఖ్ కు సంబంధించిన ఓ ఐకానిక్ సినిమా షాట్ షేర్ చేస్తూ.. కోహ్లీ లైఫ్ మెుత్తం ఒక్క ఎంట్రీ సీన్ కు సాటిరాదు అంటూ కోహ్లీ ఫ్యాన్స్ కు సవాల్ విసిరారు.
దాంతో విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అంటూ విరాట్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇలా వారు ట్వీటర్ లో పడుతున్న గొడవ వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ గొడవపై కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. కోహ్లీ, షారుఖ్ ఎవరి రంగాల్లో వారు స్టార్లు.. వారు మంచిగానే ఉంటారు మీరు మాత్రం ఎందుకు తన్నుకు చస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇద్దరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Best Actor Best Cricketer.
SRK not found Kohli at top pic.twitter.com/CRlwRGBqlQ— Pankaj Msdian (@Dhoni_Gawd) March 28, 2023
this entry scene of SRK is bigger than kohli whole life career ! pic.twitter.com/foKADR3BBr
— 𝗔𝘆𝘂𝘀𝗵 🇮🇳 (@RofiedAyush) March 27, 2023