పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో కూడా పుష్ప హవా కొనసాగుతూ ఉంది. ఈ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కాసేపు పక్కన పెడితే.. పుష్పగా బన్నీ క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ మాత్రం తగ్గదేలే అన్న రేంజ్ లో ఉంది. ఇలా పుష్ప పార్ట్-1 అన్నీ విధాలుగా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో మేకర్స్ పుష్ప-2ని త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకుని రావాలని భావిస్తున్నారు. మరోవైపు పార్ట్-1లో పుష్ప రైజ్ చూసిన ఫ్యాన్స్.. పార్ట్-2లో డాన్ గా పుష్పరాజ్ అల్లాడించేయడం గ్యారంటీ అని నమ్మకంతో ఉన్నారు. అయితే.. పుష్ప దర్శకుడు సుకుమార్ ఇప్పుడు పార్ట్-2 కథ ఎలా ఉండబోతుందో కాస్త హింట్ ఇచ్చి.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.
#Pushpa is a one-horse race… Proves, yet again, *well-made* mass entertainers remain No. 1 genre in #India… #Sooryavanshi and now #PushpaHindi revive Tier-2, Tier-3 biz during pandemic era… [Week 4] Fri 1.95 cr, Sat 2.56 cr, Sun 3.48 cr. Total: ₹ 80.48 cr. #India biz. pic.twitter.com/tmILHDpk8c
— taran adarsh (@taran_adarsh) January 10, 2022
“పుష్ప-2 అంటే… అంతా అనుకుంటున్నట్టు పుష్పరాజ్ డాన్ కావడం కాదు. పుష్ప-2లో ఎక్కువ శాతం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. పుష్పరాజ్ బాల్యం, “పుష్ప”కి అతని తండ్రికి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, “పుష్ప”కి అతని సోదరులకి మధ్య ఉండే గొడవలు, ఎర్రచందనం స్మగ్లర్స్ గురించి ఇంకాస్త డీటైలింగ్ పుష్ప-2లో ఉండబోతున్నట్టు సుకుమార్ తెలిపాడు. దీంతో.. పుష్ప-2 మొత్తం యాక్షన్ డ్రామాగా కాకుండా ఎమోషనల్ జర్నీగా ఉండబోతున్నట్టు అర్థం అవుతోంది.
#PushpaBehindTheScenes 🔥🤙@alluarjun put in 12 hours of effort for just this one shot from the song #EyyBidda in #Pushpa. The shoot for this started at 2 pm and went on until 2 am. It involved 24 dress changes and multiple variations. He is truly an icon stAAr! 🤩 pic.twitter.com/NfAxpse6Bd
— Pushpa (@PushpaMovie) January 10, 2022
నిజానికి సుకుమార్ ఈ విషయాన్ని పుష్ప పార్ట్-1 క్లైమ్యాక్స్ లో చెప్పకనే చెప్పాడు. తన ప్రయాణంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. తగ్గేదే లే అంటూ దూసుకెళ్లిన పుష్ప.. పోలీస్ ఆఫీసర్ షెకావత్ చేసిన అవమానానికి చాలా బాధపడతాడు. తన ఇంటి పేరు గురించి అవమానించిన దానికి.. ఆ పోలీస్ ఆఫీసర్ ని గుడ్డలు లేకుండా నిలబెడతాడు. ఈ ప్రాసెస్ లో తన చేతిని కూడా కాల్చుకుంటాడు. మరి.. తన గతం గురించి పుష్పలో ఇంత పెయిన్ ఉందంటే.. అతను చిన్నతనంలో ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొని ఉండాలి? ఇంత జరిగినా తన తండ్రిని ఒక్కమాట కూడా అనలేదు అంటే.. చిన్నప్పుడు ఆయన నుండి పుష్పరాజ్ ఎంత ప్రేమని పొంది ఉండాలి? తనని ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా అవమానించినా.. తన అన్నలను పుష్ప ఎందుకు టార్గెట్ చేయలేదు? ఈ ఎమోషన్స్ చుట్టే పుష్ప-2 కథ ఉండబోతుంది అనమాట. మరి.. పుష్ప-2 కథ ఇలా ఉంటే.. మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The 🔥 is going to burn brighter!
Watch #PushpaOnPrime in Hindi, Jan 14@alluarjun #FahadhFaasil @iamRashmika @Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi @actorbrahmaji @aryasukku @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/BsKosSy7RA— amazon prime video IN (@PrimeVideoIN) January 10, 2022