సాయి ధరమ్‌ తేజ్‌ వాడిన బైక్‌ గురించి మీకు తెలుసా?

saidharma tej bike accident

శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు బైక్‌ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరమ్‌తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ మినహా పెద్దగా గాయాలు కాలేదని.. అన్ని అవయవాలు సమర్థంగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్తగా మాత్రమే వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు. మెగా అభిమానులు కంగారు పడాల్సిందేమీ లేదని చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు.

saidharma tej bikeఇప్పుడు అందరూ ప్రస్తావిస్తోంది సాయి ధరమ్‌తేజ్‌ వాడిన బైక్‌ ఎలాంటి? ఎంత ధర ఉంటుంది? దాని ఫీచర్లు ఏంటి? అందరూ అడుగుతున్న ప్రశ్నలివే. మరి ఆ బైక్‌ గురించి మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్‌లో మీకోసం అందజేస్తున్నాం. అంతలా జారిపడినా.. బైక్‌ పెద్దగా దెబ్బతినలేదు అంటేనే అర్థమవుతోంది అది సూపర్‌ బైక్‌ అని. సాయి ధరమ్‌ తేజ్‌ ఉపయోగించిన బైక్‌ పేరు ‘ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌’. ఈ బైక్‌కు బీఎస్‌-6కు చెందిన 3 ఇంజిన్లు ఉంటాయి. ఇది 765 సీసీ కెపాసిటీ కలిగిన బైక్‌. దీనికి 6 గేర్లు ఉంటాయి. ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌ బైక్‌ బరువు 166 కిలోలు ఉంటుంది. ఈ బైక్‌ 121.36 బ్రేక్‌ హార్స్‌ పవర్‌(BHP) కలిగి ఉంటుంది. ఈ బైక్‌ గంటకు 220 కిలీమీటర్ల కంటే ఎక్కువ వేగంగా వెళ్లగలదు. ఫ్రంట్‌ వీల్‌, వెనుక చక్రం సైజ్‌ 17 సెంటీమీటర్లు ఉంటాయి. దీనికి ఫ్రంట్‌ టైర్‌కు రెండు డిస్క్‌లు ఉంటాయి. హైదరాబాద్‌లో ఈ బైకు ఆన్‌ రోడ్‌ ధర 12 లక్షల 78 వేల రూపాయలుగా ఉంది.

saidharma tej accidentసీసీటీవీ ఫుటేజ్‌ని బట్టి చూస్తుంటే సాయిధరమ్‌ తేజ్‌ మితిమీరిన వేగంతో వెళ్తున్నట్లుగా లేడని తెలుస్తోంది. ప్రమాదానికి ప్రధాన కారణం బైక్‌ స్కిడ్‌ అవ్వడమే. ఈ బైక్‌లు ప్రధానం రేసింగ్‌ ట్రాక్‌లు జాతీయ రహదారులపైనే నడపాల్సి ఉంటుంది. వీటి టైర్లలకు గ్రిప్‌ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని మట్టి ఉండే రోడ్ల కోసం తయారు చేయబడినవి కాదు. టైరు చాలావరకు నునుపు ఉంటాయి. సాయి ధరమ్‌ తేజ్‌ ఇసుక/మట్టి ఉన్న ప్రాంతంలో మొదట వెనుక బ్రేక్‌ వేశాడు. ఆ సమయంలో బైక్‌ వెనుక టైరు స్కిడ్‌ అయ్యింది. బైక్‌ అడ్డంగా తిరుగుతోంది.. అదే సమయంలో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన తప్పు ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ వేయడం. అలా ఫ్రంట్‌ డబుల్‌ డిస్క్‌ వేయడం వల్ల బైక్‌ ఒక్కసారిగా పక్కకు తిప్పేసింది. ఆ ఒక్క పొరపాటు సాయిధరమ్‌ తేజ్‌ చేయకుండా ఉండుంటే అంతలా గాయాలు అయ్యేవి కాదు.