కోడలిని కౌగలించుకుని కరోనా అంటించిన అత్త!

కరోనా కారణంగా దేశంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయిన వారిని, ఆప్తులను కోల్పోతున్న వారు కొందరైతే.., హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక కొందరు, ఉపాధి మార్గం కోల్పోయి మరికొందరు రోడ్ మీద పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తనకి కరోనా సోకిందని తెలుసుకున్న అత్త.. ఎక్కడ కోడలు బతికిపోతుందో అనుకుని ఆమెని కౌగలించుకుని.. కోడలికి కూడా కరోనా అంటించేసింది. ప్రస్తుతం ఈ వింత ఘటన తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఎవరికైనా కరోనా సోకితే వారిని ఐసోలేషన్ లో ఉంచుతాము. అంటే వాళ్ళని ఒక గదిలో ఉంచి.., ఇంట్లో మిగతా వాళ్ళు..వారి దగ్గరికి పోకుండా జాగ్రత్త పడుతాము. కానీ.., ఈ అత్తగారు మాత్రం కోడలి మంచి పనిని తప్పుగా అర్ధం చేసుకుంది. తనని దూరం పెట్టినా.., కోడలు కూతురిలా తనకి సమయానికి ఆహరం, మందులు ఇచ్చి కాపాడుతోందన్న విషయాన్ని ఆ అత్త అర్ధం చేసుకోలేకపోయింది. ఎక్కడ కరోనాతో తాను ఒక్క దానినే చనిపోతాను అనుకుని మందులు ఇవ్వడానికి దగ్గరగా వెళ్లిన కోడలిని కౌగిలించేసుకుంది. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే ఆ కోడలికి కూడా కరోనా సోకడంతో ఈ విషయం బయటకి వచ్చింది.

atha 2నిజానికి ముందు నుండే ఈ అత్తగారికి కోడలిపై మంచి అభిప్రాయం లేదట. ఆమె కొడుక్కి మూడేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతితో ఆమే ఇష్ట పూర్వకంగా వివాహం జరిపించింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కొడుకు బ్రతుకు దెరువు కోసం ఒడిశా వెళ్లి అక్కడే ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కానీ.., పెళ్లి అయిన నాటి నుండి కొడుకుని తనకి దూరం చేస్తోందని ఆ కోడలిపై పగ పెంచుకుంది అత్త. గతంలో ఈమె కోడలిపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. అత్తకి తనపై ఇంత కోపం ఉన్నా.., ఆ కోడలు మాత్రం కష్ట కాలంలో ఆమెని విడిచి పెట్టకుండా సేవలు చేస్తూనే వచ్చింది. కానీ.., అత్త మాత్రం కోడలిని అర్ధం చేసుకోకుండా ఆమెకి వైరస్ సోకేలా చేసింది.. ఇంతే కాదు.., ఆ తరువాత కోడలిని ఇంట్లో నుండి కూడా వెళ్లగొట్టిందట ఈ గయ్యాళి అత్త. ప్రస్తుతం ఈమె తన చెల్లి ఇంట్లో ఐసోలేషన్ లోకి వెళ్ళింది. మంచి చేయాలని చూసిన తన పట్ల అత్తగారు ఇలా వింతగా ప్రవర్తించడంతో ఆ కోడలు కన్నీరు మున్నీరవుతోంది. ప్రస్తుతం ఈమె తన భర్త రాకకోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ విషయం జిల్లా అంతటా వైరల్ కావడంతో మ్యాటర్ పోలీసుల వద్దకి చేరింది. దీంతో.., అత్తపై అంటువ్యాధుల నివారణ చట్టం కింద పోలీసులు కేసు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారట. మరి.. ఇలాంటి అత్తకి ఏ శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.