రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ బాటలోనే చిరంజీవి

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతుంది. దీని ప్రభావం అన్ని పరిశ్రమలపై పడుతుంది. ఈ క్రమంలో చిత్రపరిశ్రమపై కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది. కరోనా కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ వ్యాప్తి కారణంగా భారీ బడ్జెట్‌ సినిమాలు, పాన్‌ ఇండియా సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్‌గా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌, ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమా రాధేశ్యామ్‌ రెండు సినిమాలు రిలీజ్‌ కాకుండా ఆగిపోయాయి.

ఇప్పుడు తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా విడుదలను వాయిదా వేస్తే చిత్ర యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొణిదెల ప్రొడెక‌్షన్స్‌ ట్వీట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. మరి కరోనా కారణంగా ఇలా వరుసగా పెద్ద సినిమాలన్ని వాయిదా పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.