పెళ్లి చేసుకోకపోవడంపై అసలు విషయం బయటపెట్టిన టబు

Tabu talking about her marriage - Suman TV

‘ఎటో వెళ్లింది మనసు’ అంటూ.. ఒకప్పడు కుర్రకారును తన వైపు తిప్పుకున్నారు హీరోయిన్ టబు. అప్పటికి ఇప్పటికి తరగని సౌందర్యం ఆమె సొంతం. ఒకప్పుడు హీరోయిన్ గా సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన టబు ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. వయసు పెరిగిపోతున్న ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు, సింగిల్ గా ఉండటానికి కారణమెవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌. అవును.. ఈ మాట స్వయంగా టబునే చెప్పారు. ఆమె గతంలో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో తన పెళ్లి, ఒంటరి జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Tabu talking about her marriage - Suman TVఅజయ్ దేవగన్‌ తనకు సహచర నటుడు మాత్రమే కాదని, బాల్యం నుంచి తెలుసని అన్నారు. అజయ్ తన సోదరుడి ఫ్రెండేనని, తాను ఎక్కడికి వెళ్లిన అజయ్ ఫాలో అయ్యేవాడని, ఎవరైన అబ్బాయిలు తనతో మాట్లాడితే ఊరుకునేవాడు కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండే వాడు. అతన వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోయానని సంచలన విషయాలు వెల్లడించారు. దీనికి కారణమైన అతను పశ్చాత్తాప పడాలని అన్నాఉ. కాగా అజయ్, టబు ఇద్దరూ కలిసి ‘దృశ్యం’, ‘గోల్మాల్ అగెయిన్’, ‘విజయ్‌పథ్‌’ ‘హకీకత్’ సినిమాల్లో నటించారు. చివరిసారిగా ‘దేదే ప్యార్ దే’ చిత్రంలో వీళ్లిద్దరూ నటించారు.