'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ గెలుచుకోవడం ఏమో గానీ ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు రావడానికి తానే కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా మన ముందుకొచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది. గతేడాది మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ సంచనాలు క్రియేట్ చేసింది. మనవాళ్లతో పాటు విదేశీ ఆడియెన్స్ ని సైతం విపరీతంగా అలరించింది. హాలీవుడ్ స్టార్స్ చాలామంది ఈ సినిమాని తెగ మెచ్చుకున్నారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఆ క్రేజీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందరూ ఈ అవార్డు రావడంపై పాజిటివ్ గా మాట్లాడుకుంటుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’తో తన క్రేజ్ పెంచుకున్న రాజమౌళి తీసిన అద్భుతమైన భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్ని తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో తీసిన మూవీ ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అయిన ఆలియా భట్, అజయ్ దేవగణ్ కూడా తక్కువ నిడివి ఉన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అలా ఈ చిత్రంలో వారు కూడా భాగమయ్యారు. ఇదిలా ఉంటే ‘భోలా’ సినిమాని రిలీజ్ కు రెడీ చేసిన స్టార్ హీరో అజయ్ దేవగణ్.. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అలా ‘ది కపిల్ శర్మ’ కామెడీ షోకి కూడా వచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’కి తన వల్లే ఆస్కార్ వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
షోకి వచ్చిన అజయ్ దేవగణ్ తో కపిల్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఈ అవార్డు రావడంపై ఎలా ఫీలవుతున్నారు? అని అడిగాడు. దీనికి బదులిచ్చిన అజయ్ దేవగణ్..’నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం నిజంగా సంతోషంగా ఉంది. అయితే నా వల్లే ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చింది. ఒకవేళ ఆ పాటలో నేను డ్యాన్స్ చేసి ఉంటే వచ్చుండేది కాదుకదా’ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో షోలో ఉన్నవాళ్లందరూ గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరి అజయ్ దేవగణ్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి./p>
To ye Raaz hai #NaatuNaatuSong ko Oscar milne ka 😯 pic.twitter.com/P9GXv4sy7K
— Pooran Marwadi (@Pooran_marwadi) March 24, 2023